STORYMIRROR

kamala sri

Fantasy Inspirational Others

4  

kamala sri

Fantasy Inspirational Others

చూసి తరించాలని ఉంది//

చూసి తరించాలని ఉంది//

1 min
335

శీర్షిక :- చూసి తరించాలని ఉంది

🌹🌹🌹🌹🌹🌹🌹


కన్నీరు కారని రైతుని 

చూడాలని ఉంది!!


దళారుల మాయమాటలకు లొంగని

రైతులను చూడాలని ఉంది!!


రోడ్లమీద బిచ్చెమెత్తుకునే బిచ్చగాడు లేని సమాజం

చూడాలని ఉంది!!


సమాన పనికి సమాన వేతనం ఇచ్చే రోజుని

చూడాలని ఉంది!!!


చావుని కూడా రాజకీయం చేసే 

కుళ్లు రాజకీయాలు లేని సమాజం

చూడాలని ఉంది!!


ఆకలితో అలమటించని వారు లేని సమాజం

చూడాలని ఉంది!!


దగాకోరు మాటలతో మాయచేసే

మాయగాళ్లు లేని సమాజం 

చూడాలని ఉంది !!


కులమతజాతి వర్గ వైషమ్యాలు లేని సమాజం 

చూడాలని ఉంది!!


అబలలపై దాష్టీకాలు జరగని సమాజం 

చూడాలని ఉంది!!


కన్నవాళ్లనే కరుణ లేకుండా 

ఆస్తికోసం కడతేర్చే కసాయి వాళ్లు 

లేని సమాజం 

చూడాలని ఉంది !!!


చిన్నా పెద్దాబీదా బిక్కీ 

అన్న తేడా లేకుండా

అందరూ కలిసి మెలిసి ఉండే సమసమాజం 

చూడాలని వుంది!!!


పచ్చని పంటలతో తులతూగుతూ

ప్రకృతి వైపరీత్యాలు లేకుండా

పడతి మానం పోకుండా

సుఖశాంతులతో తులతూగే 

భారతావనిని చూడాలని ఉంది

చూసి తరించాలని ఉంది!!!


గాంధీజీ కలలు కన్న సమాజం

చూడాలని ఉంది

చూసి తరించాలని ఉంది!!!


         .... కమల'శ్రీ'✍️.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy