STORYMIRROR

Raja Sekhar CH V

Romance Classics Fantasy

5  

Raja Sekhar CH V

Romance Classics Fantasy

తోటలో తుమ్మెద

తోటలో తుమ్మెద

1 min
101


ఒక్కొక్క పువ్వూ మెల్లమెల్లగా పూసెను,

ఒక్కొక్క పుష్పం పరిమళం వెదజల్లెను,

ఉద్యానం రంగవల్లిక వలె కనిపించెను,

తుమ్మెదల ఆగమనం ఆరంభమయ్యెను |౧|


ఒక్కొక్క భ్రమరం తిరుగు తిరుగుతూ ఉండెను,

ప్రతి ఒక్క కుసుమాన్నీ పరిశీలన చేస్తూ వెళ్లెను,

చుక్క చుక్క మధుర మకరందాన్ని చవిచూచెను,

తీపి తీపి అభినవ అమృతాన్ని అనుభవించెను |౨|


ప్రతి తుమ్మెద రోజంతా ఆనందంగా గడిపెను,

తోటలో ఇక్కడా అక్కడా ఎగిరి ఎగిరి ఉండెను,

ప్రకృతి ఒడిలో ఓ వినూత్న వినోదం పొందెను,

జీవితంలో రంగురంగుల లోకాన్ని వీక్షించెను |౩|



Rate this content
Log in

Similar telugu poem from Romance