రతీదేవి...
రతీదేవి...


రవి వర్మ...పికాసో ల...
చిత్తం లో నిండిన....చిత్తరువా!
అజంతా ఎల్లోరా లను చెక్కిన
శిల్పుల మది నిండిన...ముద్దుగుమ్మా!
శ్రీనాథ కాళిదాసు ల...
మనసుని రంజింప జేసిన...రమణీ!
నండూరి...కృష్ణ శాస్త్రి ల....
కలల ... కోమలీ!
కృష్ణవంశీ... బాపు ల... బుట్టబొమ్మా!
రాంగోపాల్...రాఘవేంద్ర ల... రాగ దేవతా!
దాసరి.. విశ్వనాధ్ ల... విరాజితా!
ఓ...పూజిత..మధుమిత!
నీ తనువులోని అణువణువు
ఓ...మధువొలికే...కవిత!
అది యెట్లన్న...
కడలిని కాంచగనే...
కనులు వికసించినట్లు!
జలపాతం చూడంగనే..
మనసు ఝల్లుమన్నట్లు!
తీయటి పదార్థం చూడంగనే...
నోరూరినట్లు!
గిరులు చూడంగనే...
హృది గంతులేసినట్లు!
మల్లెలు చూడంగనే...
మత్తెక్కినట్లు!
ప్రకృతి లోని ప్రతి అణువు..
ఆనందాన్ని ఇచ్చినట్లు..
ఓ మగువా...
నీ ప్రతి అణువూ...
అందానికి.... పెటేంట్లు!
ఓ..వనితా!
నీవు లేని..
నిన్న లేదు..నేడు లేదు...రేపు రానే రాదు!
నీవు లేని..
జగము లేదు..జగతి లేదు..జనంబు లేదు!
నీవు లేని...
విరసం లేదు..సరసం లేదు...యే రసమూ లేదు!
నీవు లేని..
సుఖం లేదు..దుఃఖం లేదు..
రేయి లేదు..యే హాయి...రాదు!
నీవు లేని...
చరిత లేదు...ప్రగతీ లేదు!
నీవు లేని...
మలుపు లేదు...మార్పు...రాదు!
ఓ...జవ్వని!
నీవు లేని నాడు.. ఏదీ లేదు
కానీ!
నీకు మాత్రం..ఈ..అవనిపై..రక్షణే..లేదు!
ఇది అంతా...చూస్తున్న
ఆ దేవుడి కి...అసల మనసే...లేదు!
......రాజ్......
రవి వర్మ...పికాసో ల...
చిత్తం లో నిండిన....చిత్తరువా!
అజంతా ఎల్లోరా లను చెక్కిన
శిల్పుల మది నిండిన...ముద్దుగుమ్మా!
శ్రీనాథ కాళిదాసు ల...
మనసుని రంజింప జేసిన...రమణీ!
నండూరి...కృష్ణ శాస్త్రి ల....
కలల ... కోమలీ!
కృష్ణవంశీ... బాపు ల... బుట్టబొమ్మా!
రాంగోపాల్...రాఘవేంద్ర ల... రాగ దేవతా!
దాసరి.. విశ్వనాధ్ ల... విరాజితా!
ఓ...పూజిత..మధుమిత!
నీ తనువులోని అణువణువు
ఓ...మధువొలికే...కవిత!
అది యెట్లన్న...
కడలిని కాంచగనే...
కనులు వికసించినట్లు!
జలపాతం చూడంగనే..
మనసు ఝల్లుమన్నట్లు!
తీయటి పదార్థం చూడంగనే...
నోరూరినట్లు!
గిరులు చూడంగనే...
హృది గంతులేసినట్లు!
మల్లెలు చూడంగనే...
మత్తెక్కినట్లు!
ప్రకృతి లోని ప్రతి అణువు..
ఆనందాన్ని ఇచ్చినట్లు..
ఓ మగువా...
నీ ప్రతి అణువూ...
అందానికి.... పెటేంట్లు!
ఓ..వనితా!
నీవు లేని..
నిన్న లేదు..నేడు లేదు...రేపు రానే రాదు!
నీవు లేని..
జగము లేదు..జగతి లేదు..జనంబు లేదు!
నీవు లేని...
విరసం లేదు..సరసం లేదు...యే రసమూ లేదు!
నీవు లేని..
సుఖం లేదు..దుఃఖం లేదు..
రేయి లేదు..యే హాయి...రాదు!
నీవు లేని...
చరిత లేదు...ప్రగతీ లేదు!
నీవు లేని...
మలుపు లేదు...మార్పు...రాదు!
ఓ...జవ్వని!
నీవు లేని నాడు.. ఏదీ లేదు
కానీ!
నీకు మాత్రం..ఈ..అవనిపై..రక్షణే..లేదు!
ఇది అంతా...చూస్తున్న
ఆ దేవుడి కి...అసల మనసే...లేదు!
......రాజ్......