పల్లెపొరి
పల్లెపొరి
పల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినే...
తెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే...
పల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినే...
తెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
తాటిమట్ట చేతపట్టి తాత నన్ను తరిమినే.
తాతనే గోల్ చేసి పొల్ల ఇల్లు సేరితినే...
తాటిమట్ట చేతపట్టి తాత నన్ను తరిమినే.
తాతనే గోల్ చేసి పొల్ల ఇల్లు సేరితినే..
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినే....
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
పల్లె పోరి నవ్వుతుంటె తెగ మురిసి పోతినే
కిటికిలోంచి నన్ను చూస్తూ వెక్కిరిస్తూ దాగెనే...
పల్లె పోరి నవ్వుతుంటె తెగ మురిసి పోతినే..
కిటికిలోంచి నన్ను చూస్తూ వెక్కిరిస్తూ దాగెనే..
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినే...ll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
నులకమంచమొదిలి ముసలి నాపైన అరిచెనే
చేతినున్న ముంత నీళ్లు ముఖం మీద సల్లెనే
నులకమంచమొదిలి ముసలి నాపైన అరిచెనే.
చేతినున్న ముంత నీళ్లు ముఖం మీద సల్లెనే...
llతెల్ల పోరిని సూడగానే కండ్లు తేలేస్తినే...ll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
పూలజడల పూబోణి పూలవోణి సర్దనే..
దాచుకున్న అందాలతొ దడ పుట్టిస్తున్నదే...
పూలజడల పూబోణి పూలవోణి సర్దనే..
దాచుకున్న అందాలతొ దడ పుట్టిస్తున్నదే.....
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినే ll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
దనదనమని దాని తల్లి తిట్టి పోస్తున్నదే...
దుడ్డు కర్ర చేతబట్టి నన్ను గెదుముతున్నదే...
దనదనమని దాని తల్లి తిట్టి పోసాతున్నదే..
దుడ్డు కర్ర చేతబట్టి నన్ను గెదుముతున్నదే...
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినే ll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
తెల్లతోలు పిల్ల నన్ను తెగ ఊరిస్తున్నదే....
మాటిమాటికీ నన్ను రెచ్చగొట్టుతున్నదే....
తెల్లతోలు పిల్ల నన్ను తెగ ఊరిస్తున్నదే...
మాటిమాటికీ నన్ను రెచ్చగొట్టుతున్నదే...
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినేll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
పల్లె పోరి కానరాక పిచ్చి లేస్తున్నదే....
పోరిని కలువబోతె వాళ్ళు కలువనీయరే...
పల్లె పోరి కానరాక పిచ్చి లేస్తున్నదే....
పోరిని కలువబోతె వాళ్ళు కలువనీయరే...
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినేll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
ఊరి పోరగానికిచ్చి పెండ్లి చేసి పంపెరే..
పోరీ,పోరగాడు కలిసి నన్ను మరువమన్నరే..
ఊరి పోరగానికిచ్చి పెండ్లి చేసి పంపెరే.
పోరీ,పోరగాడు కలిసి నన్ను మరువమన్నరే..
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినేll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
గంపడంత ఆశ వుండే కొంప ముంచి పోయెనే.2ll
గరిటడంత ప్రేమలేక గలతు చేసి పోయెనే...2
గంపడంత ఆశ వుండే కొంప ముంచి పోయెనే.
గరిటడంత ప్రేమలేక గలతు చేసి పోయెనే...
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినేll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే..
llపల్లె పోరిని సూడగానే కండ్లు తేలేస్తినేll
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే...
llతెల్లవారు జామునే మాకాం ఆడ యేస్తినే.ll
llతెల్లవారు...జామునే....మాకాం..ఆడ యేస్తినే.....

