ప్రియా....
ప్రియా....
1 min
35K
ప్రియా..
అందుకోవా నా ప్రేమ పరిమళాన్ని...
నీ రూపుతో నిండిన నా ఎద సామ్రాజ్యాన్ని...
నీకై ఎదురుచూసే ఆ పట్టపు సింహాసనాన్ని....
ప్రియా..
అందుకోవా నా ప్రేమ పరిమళాన్ని...
నీ కలువ రేకుల కళ్ళను..
కంటినిండా నింపుకున్న నా కనుపాప....
నువ్వు రానిదే కమ్మని కలనివ్వనంటుందే....
అరవిచ్చే ఆ అందమైన మోమును చూడందే...
అరక్షణమైనా నా నయనం నిదురపోనంటుందే....
నీకై ,నీ ప్రేమకై నా హృదయం...
నీ ఎదుట నిల్చొని నిరీక్షిస్తుందే.....
ఇకనైనా అందుకోవా ప్రియా...
నా ప్రేమ పరిమళాన్ని......