సమయం .......
సమయం .......
"సమయం" ఇక నీకు సమయం లేదంటుంది.
ఇక చాలు నీ విరామ సమయానికి ముగింపు పలకమంటుంది.
ఎప్పుడు నీ సంతోషం కోసమో,నీ బాధ కోసమో ఆగనంటుందీ సమయం.
గత కాలపు తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడమే కాదు,
ఎదను చీల్చి చేసిన గాయాల తాలూకు గుర్తులను చేరిపేసి నిన్ను నిన్నుగా గుర్తించే బాటను వెతుక్కోమంటుంది.
సమయం స్థిరంగా ఉండనంటోంది, ఉండనివ్వనంటోంది.
నీ స్థానమెంటో,నీ విలువేంటో సమాజం గుర్తించేలా చేసుకోమంటుంది.
ఏదీ నీకోసం మారదు అంటోంది ఈ సమయం.
నువ్వే ఈ విలువైన సమయాన్ని వినియోగించుకొని వెల కట్టలేని వజ్రాన్ని అవమంటుంది.