మార్పు,చేర్పు మన చేతిలోనే..
మార్పు,చేర్పు మన చేతిలోనే..


పాలు తాగే వయసు మొదలు,పండు ముసలి వరకు పాపపు చూపు పడి బలైపోతున్న దీపాలను చూస్తూ రక్తకన్నీరు గారుస్తూన్నది ఈ పుడమి.......
ఓ జనని........!! ఆడపిల్లని అలుసుగా చూడకు, మగపిల్లాడు అని మదమెక్కిన వాడిలా పెంచకు.....
తప్పొప్పుల, హెచ్చుతగ్గుల సంఘర్షణలో సరి సమాన న్యాయాలు చేయు.......
మంచి చెడుల సమరంలో మంచి బాట పట్టేలా నడిపించు........
******
కోడలు కొరిమి లాంటింది,కూతురు కూరిమి వంటిది అనే మాటలను వంటబట్టించుకోని......
అడుగు అడుగుకి వంకలు పెడుతూ ,రాచి రంపానా పెట్టాలి అనే పెళుసు ఆలోచనలకు కళ్లెం కావాలి.....
ఈనాటి అత్త .....ఆనాటి కోడలే అన్న మాటను గుర్తెరిగి ఆ పిల్ల మా పిల్లే అని ప్రేమ పంచే కుటుంబాలు కావాలి.......
ఆడపిల్లను అడుగునవేసి తొక్కినా... భూదేవి అంత ఓర్పు ఉండాలి అన్న అర్థం లేని,అణచివేసే శాస్త్రాలను పక్కన పెట్టి అందరు సమానమే అని పలికే వేదాలు కావాలి.....
**********
వయసుతో ,వావి వరుసలతో సంబంధం లేక కాటేసే విషపు కోరలున్న ఉన్నసమాజంలో జరిగే అరాచకాలకు మూలమేదంటే....
ఆధునిక పోకడలతో అర్థం లేని ,హద్దే లేని ఆర్భాటాలు, హంగులతో బతికేటోన్ని చూసి మాకేం తక్కువ అంటూ తాహత్తుకు మించి చేసే జల్సాలు కదా.....
ఆ రొంపలో మునిగి తలమునకలై జీవితాలను పోగొట్టుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చే యువత........
నీలి నీడల ముసుర్లు చుట్టుకొని వ్యసనాలకు లోబడుతున్న బాల్యపు దశలో మొదలు కదా ..........
ఆకర్షణల మాటున నలిగిపోతూ అసలు చీకటిని చూడలేని మత్తులో మునిగి బంగారు భవిష్యత్తు బూడిదలా మారాకా గాని కనువిప్పని యవ్వనంలో కదా.....
అపరిచితమైన స్నేహాలు,అపరిమితమైన జల్సాలు మన మెదడుపై మనకే అదుపు లేని అస్తవ్యస్తమైన ఆలోచనల్లో కదా.....
రెక్కలు విచ్చుకోని పసితనం నుండి రెక్కలుడిగిపోయిన ముసలి వయసుల మనసుల్లో కూడా నీలిచిత్రాల నీడలు పెల్లుబికితే ఉంటుందా రక్షణ......????
తరగతి గదుల్లో నేర్చుకునే పాఠాల్లో ఉన్న పాఠాన్ని అర్థవంతంగా అప్పజెప్పక అనైతికంగా, అసభ్యకరంగా అనువదించే మాటల్లో మార్పులు చేయలేమా......???
ఎన్ని సవరణలనైన సరిదిద్దే దేశం మనది.....
నడిరోడ్డుపై తెగనరికే తెగువ చేసి చీడపురుగుల్లో చెమట్లు పట్టించలేమా....???
దిశల దశలు మార్చలేమా.....!!!
ఆధునికత పేరుతో , విజ్ఞానం విహంగ వీక్షణం చేయాలన్న తలంపుతో......
విచ్చలవిడిగా వదిలే అంతర్జాల చుక్కాని కి అత్యంత కట్టుదిట్టమైన అడ్డుకట్టలు వేయలేమా.........???
సంస్కృతి ని మరిచి సమానం అంటూ మునిగి తేలే మత్తులో విచక్షణ మరిచి పోయి కన్నుమిన్ను కానక ఉంటూ....
ముగిసిపోయే జీవితాలెన్నో కదా.....!
అయినా మారని వ్యవస్థ కదా ఇది.....????
సమాన హక్కుల పోరాటం మన బ్రతుకులో, మన భవితకోసం కదా, మరెందుకు ఈ వ్యసనం.........!!
యువత....!! మనసుపెట్టలేవా మార్పుకై......మరలి రాలేవా మనోధైర్యానివై.......???!!