భూమి పుత్రుడు
భూమి పుత్రుడు


తొలకరి మొదలైపోతుంది
పుడమికి పచ్చబొట్టేసేందుకు రైతన్నలు ఉవ్విల్లూరుతారు..
ఇన్నాళ్లు కన్నీళ్ల సేద్యం చేసిన కంటికి కనువిందు చెయ్యాలనుకుంటుంది బంగరు రంగులతల్లి
విరిసిన పువ్వులతో ప్రకృతి పెర్ఫ్యూమ్ వేసుకుని రారమ్మంటూ ఊరిస్తోంది
పడతి వెంట పడే ప్రియుడిలా పైపైకి వస్తాడు ఎర్రని చిన్నోడు....
పచ్చనందాల ప్రకృతిలో హరివిల్లుల కుసుమాలు భానుడిని చూసి విల్లు వంచిన రాముణ్ణి చూసి సీత సిగ్గుపడినట్టు సిగ్గులు వోలకబోస్తాయి......
అత్తిపత్తిలా ముడుచుకుపోతాయి.....
చేపకళ్ళతో శరాలు సందిస్తాయి....
సంధ్యవేళ పిల్లగాలులతో పాటలు పాడిస్తాయి...
పొద్దు జారే వేళ కాసింత సింధురాన్ని వెదజల్లి పొమ్మంటాయి
రేపటికి కాసింత ప్రేమను వెంటబెట్టుకురమ్మని చెప్పకనే చెబుతాయి.....
జీవిత సేద్యానికి భుజం మీద నాగలి మోస్తూ కుసుమానికి కళ్ళు కుట్టేలా సాగిపోతున్నాడు భూమి పుత్రుడు