వెన్నుపోటు
వెన్నుపోటు


అడుగును కూల్చే శత్రువు అయినా ఎదురుగా వచ్చి అడ్డుకునే వేళలు ఎన్నో!!
ఎక్కే మెట్లను ఎన్ని ఉన్నా భరోసా ఇచ్చే బంధాలెన్నో!!
బాధ్యతల నడుమ నలిగిపోయే వేళ మాటతో స్ఫూర్తిని ఇచ్చి ముందుకు నడిపే బంధము!!
స్వార్థపూరిత చింతన వదిలి నెనున్నానని ముందుకు వచ్చే నేస్తము!!
నిన్నమొన్నటి అడుగులలో అడుగులు కలిపి సాగిన స్నేహపు నావ!!
కాసుల కోటలపై కన్ను పడితే కన్ను మిన్ను మరచి కుట్రల వలయంలో తోసి వెన్నుపోటు పొడిచిన మిత్ర ద్రోహి!!
మనసును ముక్కలు చేసి మాయని మచ్చ చేసిన స్నేహపూదోటలో మొలిచిన కలుపుమొక్క!!