అపరిచితుడు
అపరిచితుడు


ఆశల వేటలో అంతర్మధనపు లోతుల్లో.....
నీలో దాగినదేదో నిర్లక్ష్యపు వలయాన్ని హిమపు తెరలతో
దాచేస్తూ సమస్యల సుడిగుండంలో దాక్కోమంటూ.....
అడుగు అడుగుకూ వెనక్కు లాగే లోపలి మనిషి
నేను కాదు నేనే అనే అతివాదము అంచులలో తేలియాడే మహామేధావి కి మూడు దారప్పొగుల తక్కెడలో సరితూగగలనని విర్రవీగితే
అవకాశాలను అందుకోవడానికి చాచిన చేతులు తెగనరికే అహపు పొరను వెచ్చని దుప్పటిలా కౌగిలించుకున్న కుబుసము నువ్వైతే.......
నీలో దాగిన అహంకారపు పొరను వలిచేసే అపరిచితుడు ఏదో ఒకనాడు ఎదురవుతాడు.