STORYMIRROR

Sravani Gummaraju

Drama

4  

Sravani Gummaraju

Drama

వసంతానికోక ఉత్తరం

వసంతానికోక ఉత్తరం

1 min
498

తెగిపడిన కాలంలో పారేసుకున్న జ్ఞాపకాల గుర్తులలో.....


తియ్యని మధురిమలా తట్టిలేపిన జత కోయిల.....


తరచి చూస్తే..... తెలియని కంటి చెమ్మ....


అల్లుకున్న ఆశల వలయంలో మెల్లగా ఉబికిందా....


కరగని ఒక బండ గుండెకై పరిగెట్టిందా....


తొలిపొద్దుల ఆ అడుగుల వేగం తప్పిపోయిందా....


తెలియని సందిగ్ధంలో తనలోతానే తిరుగుతూ అలసిపోయిందా...


వినిపించని ఆ మాటలకోసం ఎడబాటుకు బానిసైతే...


కలత పడిన మల్లెల హృదయం మూగబోయిందా......


విరిసిన రంగుల కలలు వెలసిపోయి విరిగిపోతే......


చెదిరిన నీడను చూసి వైరాగ్యపు గేయాలతో......


తలుపు తెరవని వసంతానికి రాసిందోక ఉత్తరం



Rate this content
Log in

Similar telugu poem from Drama