రాయని ఉత్తరం
రాయని ఉత్తరం
ప౹౹
ఉత్తరమే రాయాలని ఉబలాటం నాకు చాలా
ఉత్తమంగా రాయాలని తగని ఆరాటం భళా ౹2౹
చ౹౹
కొమ్మచాటు కోయిలని కొత్తగాను చూపాలని
రెమ్మపాటు రాగాన్ని వివరంగ వినిపించాలని ౹2౹
కలనే కన్నాను కమనీయమై కనుల విందుగ
అలలై మదిలో మారామే చేసి కలతే చెందగ ౹ప౹
చ౹౹
ఏరికోరి ఎదలో మర్మాన్నీ ఎంతో ఒద్దికా చేసి
సరిజేరి ఎడద జ్ఞానాన్నీ అంతానూ ప్రోదీజేసీ ౹2౹
సాకారం చేయను ఆ కలను నిజంగానే నేను
ఆకారం ఒకటి తానొకటీగా ఏర్పరుచమనేను ౹ప౹
చ౹౹
కనుగొని ఆ నవ్యత కమ్మదనమే చూపాలని
అనుకొని ఆ రమ్యత నడకలో కనిపించాలని ౹2౹
తలచి ప్రయత్నించినా నే రాయలేకపోయానే
అలసి రాయలేని చిత్రం రాయని లేఖాయానే ౹ప౹