కుర్రాడు
కుర్రాడు


మెరిసే ఆ వెండి తీగల మెరుపులతో ముసిముసి నవ్వులు జల్లేస్తూ.
వెండి వెన్నెలతో పోటీ పడతాడు!!
నొక్కులు పడిన బుగ్గలతో పాలదంతాలు మొలవని పసివాడై ముద్దొస్తాడు!!
దారిపొడుగునా తిరిగే మలుపుల్లా జీవితంలో ఎన్నో దాటొచ్చి అనుభవశీలై వారసులకు దారి చూపుతాడు!!
ముడుతలు పడిన దేహానికి మించి ఉత్సాహంతో దాహం తీరని వాడిలా జీవితంలో సంతోషాలు సేద్యానికి పూనుకుంటాడు!!
మనవడో మనవరాలో మురిపెంగా మాట్లాడితే మూడుకాళ్ళ ముందున్న అరవయ్యేళ్ళ వాడు కూడా యువకుడై ఆడిపాడతాడు!!
కాలంతో పాటు వయసు పెరిగినా అరవై ఏళ్ల యువకుడిగా షష్టిపూర్తిలో పెళ్ళికొడుకై మెరిసిపోతాడు!!
ఉమ్మడికుటుంబాల కు కమ్మని మమతల కోట కట్టి స్పూర్తి గా మిగిలే అరవయ్యేళ్ళ యువకుడు ఇతడు!!