STORYMIRROR

Sravani Gummaraju

Inspirational

4  

Sravani Gummaraju

Inspirational

నాలో నేను నాతో నేను

నాలో నేను నాతో నేను

1 min
553

నిశ్శబ్దాన్ని చీల్చే ద్వని తరంగము!

నిరాశను పెకిలించే ఆశాజ్యోతి!

నిస్సత్తువను అణిచివేసే ఉత్సాహం!

అపజయపు అంచులనుండి ఎగసిపడేలా చేసే ఆత్మవిశ్వాసం !

నిశిలో వెలిగిపోయే తారక ధీరత్వము!

ఆకాశానికి అర్థం చెప్పే అంతరంగపు పొరల్లో అపజయపు కలుపు మొక్కలు ఏరేసి విజయానికై విత్తులు జల్లి!!

విశ్వజగతిలో నన్ను నన్నుగా నడిపే తోడొకటి!!

నిజానికి అబద్ధానికి తారతమ్యాలను తరచి చూడమని గీతోపదేశం చేసే అంతర్ముఖమది!!

నిన్న నేడు రేపు సమయం ఏదైనా సమస్య ఏదైనా సాగిపోయే గంభీర గౌతమిలా........ "నాలో నేను" నాతో నేను ఎప్పటికీ.......


Rate this content
Log in

Similar telugu poem from Inspirational