మనసులోని మాట
మనసులోని మాట


ప౹౹
మనసులో మాట తెలుప మంచి సాధనమేలే
సొగసుగానే చెప్పను అనువైన ఆయుధమేలే ౹2౹
చ౹౹
లేఖ ఒకటి రాయనూ లేదుగా మొహమాటం
లేఖినితో చూపించను మనసులోని ఆరాటం ౹2౹
ఉత్తరమంటే సందేశవాహినిలే రెండు ఎదలకే
ఉత్తమ రాయబారై సయోధ్య పెంచూ కదలకే ౹ప౹
చ౹౹
రాసి ఒక లేఖ ఆగిపోనులే తెలుప విషయమే
చూసి వేచి ఏమరక మదినే చేస్తాను లయమే ౹2౹
ఒకటి రెండు రాసి వదలనే వద్దనక ఆ సంగతి
మాటిమాటికీ మరులు చూచులే అ పురోగతి ౹ప౹
చ౹౹
సరిగమలు చేరినే సరసాలతో సల్లాపమునకై
సరిసుమాలు సమరము చేసె ఉల్లాసమునకై ౹2౹
ఆ మాట చేరవేయనే ఆ ఉత్తరమొకటి చాలు
ఏనాటికైనా ఈ లేఖా సందేశము చాల మేలు ౹ప౹