STORYMIRROR

kamala sri

Tragedy Inspirational Others

4  

kamala sri

Tragedy Inspirational Others

ఓసారి వచ్చి పోరా కన్నా//

ఓసారి వచ్చి పోరా కన్నా//

1 min
298


ఒకే ఒక్కసారి రారా కన్నా 

చివరి సారిగా నిన్నో సారి 

కళ్లారా చూసి 

మనస్ఫూర్తిగా నిన్ను తడిమి...

చితి గా మారిపోతా...!!!


నా ప్రాణాన్నే ఫణంగా పెట్టి కన్నా నిన్ను

నా ప్రాణం పోయే గడియకైనా 

రావాలని అనిపించదా కన్నా నీకు...!!!


ముసలి ముద్దలా మారిన 

ఈ తల్లి నీకు బరువైయ్యిందని 

వృద్ధాశ్రమంలో వేసి మళ్లీ రాకపోతివి

నువ్వొస్తావని గేటువైపే చూసే 

నా ఆశ ఎప్పుడూ అడియాశే అయ్యింది 

ప్రతీ రోజూ...!!!


చితిగా మారే సమయం ఆసన్నమైంది 

అని తెలుస్తోంది కన్నా

ఓసారైనా వచ్చిపోరా 

నిన్నో సారి చూసి 

ఆనందంగా కళ్లుమూస్తా...!!!


... కమల'శ్రీ'✍️.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy