చివరి మజిలీ వాయిదా
చివరి మజిలీ వాయిదా
ఏడు అడుగులు...
ఏడు వసంతాల వేదికగా
నా చివరి అడుగు....
చివరిగా అడుగు
చివరిసారిగా చూడు
నాలుగు దిక్కుల సాక్షిగా
బంధువుల వెక్కిరింపులు
నీ గుండెను పిండి వేస్తాయి
మోసే ఆ నలుగురి ఈసడింపులు
నీ మనసును కుళ్ల పొడుస్తాయి
నా దారి పూల దారి అనుకున్నా
నా మీద చల్లేవి పుణ్యక్షేత్ర నీటితో
పూసే పువ్వులు అనుకున్నా కానీ
ఆ పువ్వుల మాటున దాగున్న
తూటాల వంటి మాటలు
ఇది పరువు హత్యే!
అనీ నిన్ను దూసిస్తే, నీవు నా వెనుకే
నీ చివరి అడుగులు వెయ్యాల్సి వస్తుందని...
పెనవేసిన పేగును తెంచలేక
అల్లుకున్న ఆప్యాయతలను
అంతం కావించ లేక
పంచుకున్న మమతలను మాయం చేయలేక
వెలిగించిన దీపాన్ని ఆర్పలేక....,
అలుముకున్న చీకటిని పారద్రోలుతూ
విడిచే శ్వాసని వేడుకొని
నా ఇంటి గడపను దాటి
స్మశాన గడపకు నా చివరి మజిలీని
చివరి నిముషంలో వాయిదా వేసుకున్నా!
