గతం వద్దు ప్రాణం ముద్దు
గతం వద్దు ప్రాణం ముద్దు
"సారీ ప్రియా !
నీకు నేను సంతోషం లేకుండా చేశాను
నీ అమితమైన ప్రేమను వదులుకొని అనంతమైన దూరంలోకి వెళ్తున్నందుకు క్షమించు!"
అన్న మెసేజ్ ను చదివి స్పందిస్తు రాసిన కవిత.
*****************
నీకు నీ గతం వద్దు
నాకు నీ గతం వద్దు
గతం తాలూకు గుర్తులు వద్దు
గతంలో గడిపిన, గతంతో ముడిపడిన
ఏదైనా మనకొద్దు
నీవు పుట్టి పెరిగిన ఊరు వాడ వద్దు
నీవు ఆటలాడిన ఇంటి అడుగుజాడలు వద్దు
నిన్ను కనిపించిన కన్న వాళ్ళు వద్దు
నిన్ను కంటికి రెప్పలా కాపాడని
తోబుట్టువులు వద్దు......
నీ ఊరు వల్లకాడు కానీ
నీ వాళ్ళు కోన ఊపిరితో కొట్టుకొని
నీ మనస్సు వారికోసం మంటల్లో కాలిపోని
నీ ప్రేమ పొలిమేరలో సమాధి కానీ
నీకు నీ గతం వద్దు, నాకు నీ గతం వద్దు
గతంతో ముడిపడిన ఏదైనా మనకొద్దు
నిన్నటి నీ అమాయకత్వం
నేటికీ నీకు ఉరిశిక్ష అయ్యే
నిన్నటి నీ తీపి జ్ఞాపకాలు
నేటికీ చేదు జ్ఞాపకాలు అయ్యే
అయినవారు కానివారయ్యే
కానివారు అయినవారయ్యే
అందుకే .....
నీ గతం గతించిపోని
నీ మనసు మరణించి పోనీ
నీ జ్ఞాపకాలు నశించిపోని
నా ప్రపంచం నీవే అని,
నీకు తెలిసే లోపు
నా నుండి నీవు దూరంగా వెళ్లి పోకు
నన్ను మరచి, నన్ను విడిచి
నన్ను ఒంటరిని చెయ్యకు
ఎందుకంటే ....
నీ చీకటి బతుకులో వెన్నెలై కాస్తాను
నీ దుఖ:పు దారుల్లో పూలబాటనవుతాను
నీ మూగబోయిన గొంతులో తీయటి పదం అవుతాను
నీ బండబారిన గుండెలో సెలయేరునవుతాను
మోడుబారిన నీ బతుకు ఆశలకు
నవ వసంతమై చిగురిస్తాను....!
నీ గతాన్ని తొలుచు
నీ మదికి నన్ను పిలుచు
నా పరిచయం కాలం కంటే విలువైనది
రేపటి నీ విజయానికి
నేడు నేను పునాదినవుతా
నీ జీవితపు చివరి అంచుల్లో
నేను నీ ప్రాణమై నీ గుండెల్లో కొలువుంటా!
అందుకే....
నీకు నీ గతం వద్దు
నాకు నీ గతం వద్దు
గతం తాలూకు గుర్తులు వద్దు
గతంలో గడిపిన, గతంతో ముడిపడిన
ఏదైనా మనకొద్దు
*******
గత చేదు జ్ఞాపకాలను సమాధి చేస్తు
ముందుకు సాగడమే జీవితం
గతం కంటే, పరువు కంటే, ప్రాణం గొప్పది
********
సుదూరం నుండి సమీరం సినీ సంగీతాన్ని లీలగా మోసుకొచ్చింది.
"మరిచిపో నేస్తమా.....హృదయముంటే సాధ్యమా
మరిచిపో నేస్తమా......హృదయముంటే సాధ్యమా
జ్ఞాపకాల నీడలు....... తీపి చేదు భాసలు........
నీ గుండెల్లో చేరిపేసుకో..... నీకోసమే తుడిచేసుకో
గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యాలు
ఇక వినిపించునా కనిపించునా
వినిపించునా........ కనిపించునా......
మరిచిపో నేస్తమా.....హృదయముంటే సాధ్యమా"
