STORYMIRROR

T. s.

Abstract Tragedy Classics

4  

T. s.

Abstract Tragedy Classics

చివరి మజిలీ

చివరి మజిలీ

1 min
339

మనసు తుట్టెకు మంట పెట్టి మండించారెవరో.

వేదనల జ్ఞాపకాల జాలు కదిలింది ఈ వేళ

కల్లలయిన కలలు కళ్ళముందు కదిలాయి.

కరిగిపోయిన ఆశల స్వప్నాలు మనసులో

మరుగుతున్నాయి.

మబ్బులు కమ్మిన మనసుకు..

ప్రేమలన్నీ..

కోల్పోయిన బంధాలవుతాయేమో..

బంధాల పిలుపులు మారిపోతాయేమో

కాలం మారిన మారని నైజం వెలుగుతున్న కాగడాలా..

నివురు గప్పిన హృదయం మంటల్లో మసి బారి..

అదిరే గుండె చుట్టూ ఆగని గందరగోళం గమ్యం..

ఆశల అంచులపై నిప్పులు అడుగేస్తుంటే

నిశ్శబ్దంగా సాగని బ్రతుకు పయనం..

ప్రకాశవంతంగా కనిపించే ప్రపంచం వైపుగా..

నడుస్తూ..చివరగా చితి వైపుగా..చేరిన చివరి మజిలీ..


Rate this content
Log in

Similar telugu poem from Abstract