కోటి విద్యలు కూటి కొరకే
కోటి విద్యలు కూటి కొరకే
అరక పట్టి అవని అంతా
దున్ని అన్నం పెట్టే రైతన్నయినా..
శత్రు సంహారం గావిస్తూ
సరిహద్దు పహారా గాస్తున్న సైనికుడయినా..
భావితరం బంగరు బాటకై
బలపం పట్టి అక్షర సేద్యం గావించు గురువయినా...
పగలు రాత్రి పట్టించుకోక
ప్రాణరక్షణే ధ్యేయంగా సాగుతున్న వైద్యుడయినా...
న్యాయం గెలవాలంటూ తపించే
నల్లకోటు ధరించే న్యాయమూర్తయినా..
గురి తప్పని సవ్యసాచి లా
గాడి తప్పని గమనంతో
గమ్యం చేర్చు డ్రైవరయినా...
వృత్తి కి న్యాయం చేస్తూ
నిబద్ధత తో సాగు ఏ వృత్తిలోనయినా..
దొంగయినా దొరయినా
జానెడు పొట్ట కై
పిడికెడు ముద్ద కోసమే
కోటి విద్యలన్నీ కూటి కొరకేనని
మనగడకై సాగించు పోరులో
ఆకలిని గెలవాలన్న ఆరాటమేనని
