త్రిశంకు స్వర్గం
త్రిశంకు స్వర్గం


*******************
బ్రతుకు నిత్యం సమరమే
అనునిత్యం కురుక్షేత్రం
సామాన్య జీవన చిత్రం బహు చిత్రమే
కష్టసుఖాల సంగమం
సుఖదుఃఖాల సమాహారం
పరుగులెడుతున్న కాలం వెనకే
పొట్ట కూటి కై తప్పని తిప్పలు
పలు రకాల భంగిమల పాట్లు
బరువెక్కిన గుండెలు
అపశృతుల రాగమాలపించినా
ఆశల చివురులు నేల రాలి
వాడిన తరువులను తలపిస్తున్నా
ఆత్మస్థైర్యపు బీజాలు మనసులో నాటుకుని
ఎప్పటికప్పుడు చైతన్యపు మొలకలతో
మట్టిమీద ఆశ చావక
రెక్కాడితే గాని డొక్కాడని బతుకులకు
తనకు తనే ఊపిరులూదుకుంటూ
బతుకు వనంను పండించుకునే
అతి సామాన్య జీవన చిత్రం
మంటికి మింటికి మధ్య ఊగిసలాడే
త్రిశంకు స్వర్గం