STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

5  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

ఇంధనం...(నాన్న)

ఇంధనం...(నాన్న)

1 min
350

ఈ సమాజమే ఒక ఆవరణం

నాన్నే......... దానికి ఆభరణం

నీ నడవడికే తెచ్చింది మాకు ఆదరణం

నీ ఋణం తీర్చుకొనేందుకు ఇదే మంచి తరుణం


నాన్నా...

వినిపించావు మన గళం

కుటుంబమంటే..ఒక దళం

దానికి నీవే గా బలం

నా రాత మార్చింది శ్రమనే నీ కలం


నాన్న...

నీ మనసు లవణం

నీ తనువు మాకు భవనం

నీ కీర్తి తాకాలి గగనం

నీ నామమే కావాలి మాకు మననం


నాన్న..

నీవు కొన్న చెప్పులు..

నీవు తెచ్చిన బట్టలు...

నీవు ఇచ్చిన బైస్కిలు..

నీవు చూపిన సినిమాలు..

ఇలా యెన్నో యెన్నో..నీ ప్రేమ గుర్తులు


నాన్న...

నీ సంపాదన ఎంతో చిన్న

కానీ!

మా ఆలనా పాలన చూచుటలో 

అందరికన్నా నువ్వెంతో మిన్న

నాన్న..

నువ్వు తిన్న ఒక పూట అన్నం

నేడు మాకు పంచభక్ష పరమాన్నం

నువ్వు కోల్పోయిన ఆనందం

నేడు మాకు తెచ్చిపెట్టింది ధనం


నాన్న

మేమంతా కుటుంబమనే బండిలో   

కులాసాగా సాగిపోయే ప్రయాణికులం

నువ్వు మాత్రం మాకోసం 

అరిగిపోయి తరిగిపోయే

ఇంధనం


        .......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Action