Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

తిరిగివచ్చిన లేఖాశ్రీ : కథానిక - కవీశ్వర్

తిరిగివచ్చిన లేఖాశ్రీ : కథానిక - కవీశ్వర్

2 mins
290


తిరిగి వచ్చిన లేఖా శ్రీ : కథానిక (ప్రాంప్ట్ - 16)

ఒక ఊరిలో శ్రీ లేఖ అనే అమ్మాయి ఉండేది . ఆమె తన తల్లిదండ్రులతో కలిసిమెలిసి చదువు ను కొనసాగిస్తూ ఉండేది . కానీ ఆ ఊరిలో పాఠ శాల లో ఎనిమిదవ తరగతి వరకే ఉండేది. ఆ అమ్మాయి ఎనిమిదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది . ఆ తరువాత పై చదువులకోసం ఆ అమ్మాయి తల్లిదండ్రులు దగ్గరలో నున్న విజయ వాడ లోని రెసిడెన్షియల్ పాఠ శాలలో చేర్పించారు . ఆ అమ్మాయి తల్లిదండ్రులు కష్టపడి , సంపాదించి ఆ అమ్మాయిని చదివిస్తున్నారు. 

ఒక రోజు ఆ అమ్మాయి తన ఆలోచనల ఒక లేఖాశ్రీ ని రాసింది. ఆ లేఖ లో ఆ అమ్మాయి ఆ పాఠశాల సమీపం లో నున్న దర్శనీయ స్థలాలను , వింతలూ విశేషాలను కూడా వివరించింది. కానీ అందులో చిరునామాను తన స్నేహితురాలైన శుభశ్రీ కి రాసింది . ఆమె కర్ణాటక లోనని బేలూరు , హళేబీడు లో ఉటుంది. శుభశ్రీ ఆ లేఖను అందుకుని తానూ అక్కడి హొయసల రాజుల శిల్పకళా నైపుణ్యం , దేవాలయాల గురించి , తుంగభద్రా తీరాన ఉన్న ప్రకృతి రమణీ యతను , చారిత్రిక విశిష్టతను గురించి , ప్రభు ( దేవ) భక్తి ని గురించి రాసి ఆ లేఖను దేశ రాజధానిలోని తన స్నేహితు రాలైన కృష్ణ ప్రియకు పంపింది . కృష్ణప్రియ తండ్రి ఒక దేశ సైనికుడు . అందువల్ల ఆ అమ్మాయి ఆలోచనా తరంగాల భావనలని దేశభక్తిని గురించి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి , ఆమె దేశభక్తులు , దేశరక్షణ, దేశభక్తి గురించిన సమాచారాన్ని ఆ లేఖలో జతపరిచి , ఆ లేఖను జపాన్ లో గల ప్రీతీ కి పంపించింది. అక్కడ ప్రీతీ వాళ్ళ నాన్న ఒక ఉన్నతోద్యోగి. ప్రీతీ ఆ జపాను దేశంలో గల దర్శనీయ స్థలాలు , అక్కడివారు దేశాభిమానాన్ని, ఇంకా అక్కడి ప్రజల హార్డ్ వర్క్ ని సవివరంగా ఆ లేఖాస్ర్తీ లో రాసింది. ఆ తర్వాత ప్రీతీ ఆ లేఖను రష్యా లో గల తన స్నేహితురాలగు నవ్రతిలోవా కు పంపించింది. నవ్రతిలోవా ఆ లేఖలో అక్కడి రెడ్ స్క్వేర్ , సోషలిజం గురించి అక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని , ఓల్గా నది పరవాళ్ళగురించి, హంసల సరోవరం, తమ దేశ గొప్పదనాన్ని గురించి వ్రాసి ఆ లేఖను తన స్నేహితురాలగు మేరీ ఉన్న లండన్ కి పోస్ట్ చేసింది . 

లండన్ చేరిన ఆ లేఖలో మేరీ థేమ్స్ నది , బిగ్ బెన్ గురించి, దర్శనీయ స్థలాలను , అక్కడి వారసత్వ రాజరికాన్ని గురించి, ప్రఖ్యాత ప్రదర్శన శాలల గురించి రాసి వాటికి సరిపడా రంగురంగుల చిత్రపాఠాలను (ఫొటోస్ ) జతపరిచి అమెరికాలో ఉన్న నిరుపమ అనే స్నేహితురాలికి పంపించింది. ఆ అమ్మాయి కూడా అమెరికాలోని గ్రాండ్ కెన్యాన్ గురించి , ఇంకా అమెరికాలోని నయాగరా జలపాతం ఇంకా అమెరికా లోని మన భారతీయుల గుడులు ఇంకా దర్శనీయ ప్రదేశాల గురించి , అక్కడి విశే షా లను , విశిష్టతలను గురించి వ్రాసి తన స్నేహితురాలగు కల్పన కు చిలీ కి పంపించింది . ఆ అమ్మాయి ఆ లేఖలో అక్కడి వింతలను, అమెజాన్ నది , అక్కడి అడవుల గురించి అక్కడి దేశభక్తి గీతాన్ని భావార్థము తో కూడా వ్రాసి కైరో లోని తహ స్నేహితురాలగు శ్రీమణి కి పంపింది . శ్రీమణి ఈజిప్తు లోని నైల్ నది , కాంగో బేసిన్ , ఇంకా వజ్రాల గనులు, దక్షిణ ఆఫ్రికాలోని బాపూజీ స్మారకాన్ని గురించి ఏంటో వివరంగా , అక్కడి స్వాతంత్ర్య ఉద్యమాలను గురించి వివరం గా వర్ణ చిత్రాలతో ఆ లేఖను తన మితృ రాలగు శ్రీ లేఖకు విజయ వాడ కు పంపించింది. ఇంతలో ఆ శ్రీ లేఖ కు పరీక్షలు సమీపించినాయి . ఆ పరీక్షలో ఆ అమ్మాయి ఎంతో వివరంగా ప్రశ్నలకు సమాధానములను వ్రాసి రాష్ట్రములో ప్రథమ విజేతగా నిలిచింది. ఆ విధంగా ప్రపంచములోని తన వివిధ దేశాలలోని స్నేహితురాళ్ళతో ఇతరవివ రాలను తెలుసుకుంటూ జీవితంలో , తన కెరీర్ను అభివృద్ధి పరుచుకుంటూ స్థిర పడింది. . అంతే కాకుండా శ్రీ లేఖ ఆ లేఖశ్రీ ని సంరక్షించుకుంటూ భావితరాలవారికి అన్ని రకాల జ్ఞానాన్ని, ఆచార వ్యవహారములు మొదలైనవాటిని అందిస్తూ తనవంతు పాత్రను , విధిని , క్రియలను నిర్వర్తిస్తూ ఉంటుంది. 

 వ్యాఖ్య : " జ్ఞాన సముపార్జన అనేది అందరికీ అవసరమే దానికోసం తగిన కృషిని సల్పి సదుపయోగం చేసుకోవాలి. " 

కవీశ్వర్ . 22.05.2021


Rate this content
Log in

Similar telugu poem from Action