STORYMIRROR

Keerthi purnima

Action Classics Inspirational

5  

Keerthi purnima

Action Classics Inspirational

ఒంటరి కాను నేను!!

ఒంటరి కాను నేను!!

1 min
322

బరించానూ బరించానూ!!

ముత్తైదువల నోటి తో ఇసాడుంపులు బరించాను


చూసాను చూసాను!!

ఒంటరినని కామం తో చూసిన క్రూరమృగాల పాడు చూపులు చూసాను


విన్నాను విన్నాను!!

ఒంటరి దానికి డబ్బులేడివి అని గుసగుస లాడిన చెవులు కోరికే మాటలు విన్నాను


సహించాను సహించానూ!!

నష్ట జాతకురాలినని అసహ్యించుకున్న సమాజాన్ని సహించాను


ఇక వినేది లేదు చూసేది లేదు!!

సహించేది లేదు బరించేదీ లేదు!!


చెప్తాను వారికి సమాధానం చెప్తాను

 సూటిగా సమాధానం చెప్తాను

నా విజయం తో సూటిగా మాట్లాడుతాను!!


పడుపు వృత్తి కి దిగమన్నారు

కడుపు నిండుద్ధి రమ్మన్నారు!!

చెయ్యి పట్టిన రాక్షసమూకల 

చెదలు పట్టిన ఆలోచనని 

ముక్కలు చేసే దాకా ఆగేది లేదు!!


ఏమీ సాధించలేనన్నరు

నడిరోడ్డు మిదకినెట్టారూ!!

బంగారు పతాకాన్ని తెస్తాను

సాధించి నేనేంటో చూపిస్తాను!!

అంతవరకు అలిసేది లేదు సొలిసేది లేదు


సాధిస్తాను సందిస్తను

 నా జీవితం దురదృష్టం కాదని 

కష్ట పడి నిరూపిస్తను!!

అనుకుంటే ఏదయినా సాధించగలనని 

చేసి నేను నిరుపిస్తాను!!


ఒంటరి కాను నేను ఒంటరి కాను

ధైర్యం తోడుంది నాకు!!

ఒంటరి కాను నేను ఒంటరి కాను

విజయం తోడుంధి నాకు!!


ఒంటరి కాను నేను!!

ఒంటరి వాళ్ళకి స్ఫూర్తిని అవుతాను!!

రేపటి తరానికి మార్గదర్శి నీ అవుతాను!!


ఒంటరి కాను నేను!!

నా విజయం తో సూటిగా మాట్లాడతాను!!

నోరు మూసిన సమాజానికి సమాధానం చెపుతాను!!



Rate this content
Log in

Similar telugu poem from Action