ప్రేమ లేని బ్రతుకు
ప్రేమ లేని బ్రతుకు
ఎవరు నువ్వు
గుండె వేగాన్ని పెంచింది
నీ రాక
గతపు గాయాలను
చెరిపేసింది నీ పరిచయం
సర్వం సమస్తం అనిపించింది
నీ ప్రేమ సాంగత్యం
శ్వాసవై బాసవై
మనసున మనసయి
నీ పరిష్వంగనలో లీనం
వున్నట్టుండి
నీ ప్రేమ తిరస్కరణ
మనసు బహిష్కరణ
ఆనందాలన్నీ మూటగట్టి
ఆశలన్నీ ఆవిరిచేసి
ఎటో వెళ్లిపోయావు
మనసు లేని ఈ బ్రతుకు
ఎంత నరకమో
నీకెలా తెలిపేది
నీకర్పణ చేసిన ఈ మనసును
బ్రతికించగరావా
మన ప్రేమను పండించగ
తిరిగి రావా
