STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

త్యాగమయి

త్యాగమయి

1 min
276

శీర్షిక:త్యాగమయి

***********************

అందు గలదిందు లేదను సందేహం వలదన్న చందాన

ఆమె లేని సృష్టి కలదే 

ఆమె లేని గమనం కలదా

ఆమెను ఊహించని జగతి శూన్యం కదా

ఎందైనా ఎందులోనైనా 

మనసు పెట్టి పరికిస్తే

అందున ఆమెనే కనిపించును

అది షోకేస్ లో బొమ్మ గానూ

నిజ జీవితాన అమ్మగానూ

ఏ రూపున పోత పోస్తే

ఆ రూపు సంతరించుకునే ఏకైక శక్తి

ఆమెకు గాక ఇంకెవరికీ 

ఆమొక మైనపు ముద్ద

నీ చేతిలో నిండుగా ఒదిగి

తరించి పోతుంది తపించి పోతుంది

నీకు నచ్చినట్టు మలుచుకునే

స్వేచ్ఛనిచ్చి ఆమె జన్మను సార్థకం గావిస్తుంది

అమ్మగా అవనిని అలంకరించి త్యాగమయిగా ఇలలో నిలిచిపోతుంది


Rate this content
Log in

Similar telugu poem from Fantasy