STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Romance Classics Fantasy

4  

Thorlapati Raju(రాజ్)

Romance Classics Fantasy

ఎదురు చూపులు..

ఎదురు చూపులు..

1 min
296

ఓ నా..ప్రియా!

నీ కోసమే...


అలుపెరుగని..తలపు

వేళాపాళా లేని...వలపు

ఆశగా ఎదురు చూసే...రేపు


నీ నుండి...

మలుపు లేని...ధ్యాస!

నీపై...

మరపు లేని...శ్వాస!

నీకై ఎదురు చూడటం లో...

కలుపు లేని... ఆశ


నీ ఊహలు ...రేపెను

మదిలో....మొహపు కథలు

యదలో తాపపు సెగలు

తనువు న...వెచ్చని పొగలు

మనసంతా...

ఒకటే...తీయటి దిగులు


ప్రియా....

నీ...ఆత్మీయ పిలుపు కోసం...

నీ..చల్లటి చేతి స్పర్శ కోసం..

నీ..వెచ్చని కౌగిలి కోసం..

నీ...అంతులేని ప్రేమ కోసం..


నీ..వెన్నెల...చూపు కోసం..

నే చూడని...ఎదురు చూపులు లేవు!


పగటి కోసం..

ఎదురు చూసే సూర్యుడి లా!

రేయి కోసం..

ఎదురు చూసే జాబిలి లా!

ఆదివారం కోసం...

ఎదురు చూసే ఉద్యోగి లా!

నెల జీతం కోసం...

ఎదురు చూసే కార్మికుడి లా!


లేక...

పంట చేతికి రావాలి అని..

వత్సరమంతా....

ఎదురు చూసే రైతన్న లా...


రోజుకో..

వారానికో...

నెలకో...

వత్సరానికో...


నీకోసం చూసే...

నా ఎదురు చూపులు ఆగిపోకూడదు


ఓ..నీరజాక్షి!

నా ఆయువు మొత్తం...

ఆశ గా నీకై నే ఎదురు చూడాలి


అందుకే...

నీ చూపుతో నన్ను సోకకు

నీ రూపు...నాకు చూపకు


నువ్వు నా ఎదుట పడి

ఈ...నా ఎదురు చూపులు.. ఆపకు!


       ....రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Romance