STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

మాతృదేవోభవ

మాతృదేవోభవ

1 min
230

మాతృప్రేమ

*********************

నవమాసాలు నరకమనిపించినా

నవ్వడం నేర్చుకుంది నీ కోసం

ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా

పురిటి నొప్పుల కు సిద్ధపడింది నీ కోసం

కడుపు లో కకావికలం అవుతున్నా

పంటి బిగువున బాధను భరించింది నీ కోసం

రూపం తెలీకపోయినా

ఊహలలో అందంగా చిత్రించుకుంది నీ కోసం

తనువును తరువుగా మార్చి

త్యాగాలతో తల్లి గా తరించింది నీ కోసం

పొత్తిళ్ళలో ప్రేమను పంచి

తన సుఖాలను సర్వం త్యజించింది నీ కోసం

తన రక్తాన్ని క్షీరంగా మార్చి

పేగు బంధాన్ని పాల బంధంగా మార్చుకుంది నీ కోసం

బిడ్డ బాగోగులే లక్ష్యం గా సాగి

అణువణువు అమృతధారలు కురిపిస్తుంది నీ కోసం

చెట్టుకు వేరుకు వున్న సంబంధమే

తల్లి కి పిల్ల కి విడదీయరాని బంధమని

చెట్టుకు కాయ ఎన్నటికీ భారం కానట్టే

తల్లి కి పిల్ల ఎప్పటికీ భారం కాదని నిరూపిస్తుంది నీ కోసం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational