మాట తూట
మాట తూట
రుచులు మరిగిన జిహ్వ
మదమెక్కి కత్తులు దూసి
కుత్తుక లు కోయగలదు..
మిఠాయిల మాటలతో
నిలువునా ముంచేయగలదు..
తూటాలా మారి గుండెను
తూట్లు పొడిచేయగలదు..
పొగడ్తలతో పొసగమేలంటూ
నిన్ను ఏమార్చ గలదు..
మంచిలో ముంచిన స్వచ్ఛతతో
నరాలను తెగ్గోయగలదు..
అడ్డూ అదుపు లేకుండా
విశాలంగా విస్తరించి మానవత్వపు
కొమ్మను తుంచేయగలదు..
అచ్చికబుచ్చికలతో మచ్చిక చేసుకొని
బంధాల తీగను తెగ్గొట్టగలదు..
స్వార్థపూత పూసుకుని
విషపూరితమైన నరం లేని నాలుక
రాకెట్ లా నీవైపు దూసుకురాక మునుపే
అంతరాత్మను రక్షణగా నిలబెట్టి
నిన్ను నీవు కాపాడుకో..
