అమ్మ కు నీరాజనం
అమ్మ కు నీరాజనం
శీర్షిక: అమ్మ కు నీరాజనం
****************************
అమ్మ చేతి మగ్గం పై ఆపసోపాలు పడుతూ
పంచప్రాణాలు ఆడబిడ్డేనంటూ
ఆకలి మంటలను ఆకలితోనే ఆవిరి చేసి
కాకుల కారుకూతలను కడుపులోనే దాచి
బంగారు భవిష్యత్తునే భీష్మ ప్రతినగా బూని
అహోరాత్రులు రెక్కలు ముక్కలు చేసి
పైసాపైసా కూడబెట్టి కఠోరదీక్షతో
సరస్వతీ కటాక్షం కోసం సర్వ నోములు నోచి
నిరక్షురాలైన నిండు మనసుతో నిస్వార్ధం కలిగి
అక్షర జ్ఞానంను నరనరాల్లో నింపి
అకుంఠిత దీక్షతో అహర్నిషలు శ్రమించి
ముందు చూపుతో తన కంటి చూపును కోల్పో
యి
బంగారు భవితను అందించిన మేలిమి బంగారం
ఆమే ఆమే మా అమ్మ
జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించే అద్భుత భాండాగారంగా
తీర్చిదిద్దిన తన త్యాగ నిరతికి అమృతమయికి
వందనం...పాదాభివందనం
అమ్మ విజయానికి చిహ్నంగా మిగిలిన నేను
ప్రతిభను చాటుతూ లక్ష్యం చేరుతూ కీర్తికిరీటాలు చేరడమే
అమ్మలగన్న అమ్మకు అమ్మగా నేనిచ్చే చిన్ని బహుమానం
గుడి లేని దైవంగా నిలచిన అమ్మకు
అవును .. అలాంటి అమ్మే ఎప్పుడూ గుర్తొస్తూనే వుంటుంది మరి
ఈ అక్షరకుసుమమే నిజమైన నీరాజనంగా అర్పిస్తూ....
మాతృదినోత్సవ శుభాకాంక్షలు