STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Tragedy Others

4  

VENKATALAKSHMI N

Abstract Tragedy Others

వెలుగు చూడని వాస్తవాలు

వెలుగు చూడని వాస్తవాలు

1 min
317

శీర్షిక: వెలుగు చూడని వాస్తవాలు

*******************

ఎప్పటిలానే..

రోజులు దొర్లుతున్నాయి

మోదాలను కొందరికి

ఖేదాలను కొందరికి

షరా మామూలే అన్నట్టు

వరదలు తుఫాన్లు సునామీలు

వింత పోకడలు పుణికి పుచ్చుకున్న

ప్రపంచీకరణ నీలి నీడల్లో

వైరస్ వెర్రి తలలు వేస్తూ

పొట్టన పెట్టుకున్న ఎన్నో బంధాలు

మదమెక్కిన మానవ మృగాల చేతిలో

బలయిన లేత పసిమొగ్గలు

నానాటికీ పెరిగిపోతున్న

పౌలస్త్య బ్రహ్మ సంతానం

భ్రష్టు పడుతున్న రాజకీయాలు

రక్తమోడుతున్న రైతు జీవితాలు

భూకబ్జా కోరలు భూకంపాల బెరుకులు

ఇలా.. చెప్తూ పోతే చాటడంత

ఏమున్నది గర్వకారణం

చరిత్ర మొత్తం చెదలపుట్టలు

వెలుగు చూడని వాస్తవాలు

ఆనవాయితీగా భరించడం తప్ప

బ్రతుకు పరిమళాలు ఆస్వాదించేదెప్పుడో

నిండైన జీవన సౌరభం

వెదజల్లేదెన్నడో


Rate this content
Log in

Similar telugu poem from Abstract