హస్తభూషణం
హస్తభూషణం
శీర్షిక: దివ్యవరం
********************
పుస్తకం హస్త భూషణం..
మస్తిష్క మధనానికి
సరియైన సాధనం..
మదనపడే మదికి
దివ్య ఔషధం..
సమస్యలకు సూటిగా
సంధించే శరం..
మనిషి మనిషికీ
నేర్పును సభ్యత సంస్కారం..
పతనమవుతున్న విలువలకు
దొరికిన దివ్య వరం..
ప్రజలందరికి ప్రతిష్ట ను
పెంచే ప్రగతికి సోపానం..
అంతర్యుద్ధం నుండి అంతరిక్షం దాకా
పరిచయం చేసే విజ్ఞాన సంపన్నం..
ఒంటరి పయనంలో సేదతీర్చి
తోడునిచ్చే తీయని నేస్తం..
ఆశల సౌధానికి మార్గం చూపే
అత్యున్నత గెలుపు శిఖరం..
అజ్ఞాన తిమిరాన్ని తరిమే
దేదీప్య మానమైన జ్వలనం..
విశ్రాంతి సమయమును
సార్థకం చేసే సాటిరాని తిరుగులేని ఊహించని వరమే పుస్తక పఠనం ..