STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Fantasy Others

4  

VENKATALAKSHMI N

Tragedy Fantasy Others

ప్రకృతి వైపరీత్యం

ప్రకృతి వైపరీత్యం

1 min
316

*********************

అవని గుండెలో గునపం

దించుతూ ఖనిజ సంపదకై

చీల్చిన పొరల దొంతరలు

భారీ పరిశ్రమల నిర్మాణం తో

వాయు కాలుష్యము జరిగి

రక్షణ పొర ఓజోన్ కు పడిన చిల్లులు

ప్రాణం పోసి దాహం తీర్చే

పవిత్ర నదులు కలుషితం చేసిన మనుషులు

పచ్చని తివాచీ పరుచుకున్న

వృక్ష సంపదను కొల్లగొట్టి

గంభీరంగా నిలబడిన ఆకాశహార్మ్యాలు

జీవవైవిధ్యం నిర్జీవమై ఋతుక్రమాలు మారి

ఉపద్రవ రూపేణ హెచ్చరిక చేస్తున్న ప్రకృతిని

నిర్లక్ష్యం చేస్తున్న ఓ మనిషి

ఆ ప్రకృతి లేనిదే నీవు లేవని మరచి

ఆధునికత పేరుతో వికృతంగా మార్చి

నీ మరణ శిక్ష ను నీవే రాసుకుంటున్నావు

ఇకనైనా మేలుకో

పెరుగుతున్న పెను మార్పు గమనించి

కంపించిపోతున్న కాళ్ళ కింద నేల

మళ్ళీ కరుణించాలంటే

ప్రకృతి లేనిదే మనుగడ లేదని తెలుసుకో


Rate this content
Log in

Similar telugu poem from Tragedy