STORYMIRROR

VENKATALAKSHMI N

Action Inspirational Others

4  

VENKATALAKSHMI N

Action Inspirational Others

అంబేద్కర్

అంబేద్కర్

1 min
347


అంశం: రాజ్యాంగ స్ఫూర్తి

శీర్షిక: వేకువ కిరణం 

**************************

ఆ చేతులు అణగారిన వాడంటూ

ఆ చూపులు నిమ్నజాతివాడివంటూ

ఆ మాటలు అంటరానివాడివంటూ

వేలెత్తి చూపుతూ,కత్తుల్లా గుచ్చుతూ

శరాల్లా సంధిస్తూంటే మౌనిలా వుండిపోయాడు

ఎన్ని అవమానాలు..

ఎన్నెన్ని బెదిరింపులు..

ఎన్నెన్నో చీదరింపులు..

అన్నింటికీ మౌనమే సమాధానం

అప్పుడే..మనసు గాయపడిందప్పుడే..

ఆ క్షణం ఆవేశాల లావాలో

దహించిన మనసును 

ఓదార్పు నీరుతో చల్లార్చి

తక్షణ కర్తవ్యం బోధపడి

పట్టుబట్టి మెట్టు మెట్టు ఎదుగుతూ

సమాజ పునర్నిర్మాణంకు పునాదిరాయిగా

అణగారిన వర్గాలకు ఆదర్శప్రాయుడిగా

దేశ భవిష్యత్తుకు రాజ్యాంగ రచన గావించి

భరతజాతి గర్వించే భారతరత్నగా నిలిచి

దేశ ఔన్నత్యాన్ని శిఖరపు అంచున సగర్వంగా నిలబెట్టిన తూరుపు తొలిపొద్దుగ మారాడు

చీకటి రాజ్యాన్ని చీల్చి చెండాడిన వేకువ కిరణమై వెలిగాడు..

త్రివర్ణ పతాకంలో అశోక చక్రమై నిలిచాడు..

అంబేద్కర్ గా అందరి నాలుకలలో మెదిలాడు..

అతడి సేవలు చిరస్మరణీయం..

అతని జీవితం అజరామరం..


Rate this content
Log in

Similar telugu poem from Action