STORYMIRROR

Jyothi Muvvala

Action Classics Fantasy

4  

Jyothi Muvvala

Action Classics Fantasy

మేఘసందేశం

మేఘసందేశం

1 min
373


వాన చినుకులు జత కలిశాయి 

నేలను ముద్దాడనికి నింగి నుంచి కదిలాయి 

అతిథిగా వచ్చిన వానమ్మకు నదులు ఉప్పొంగాయి 

కొండ కోన తిరిగాయి వాగువంక పొంగాయి

పట్టణాలను చూడాలని పరవశించాయి

జల మట్టాలు పెరిగాయి గట్లు తెగాయి 

వానకు వరద తోడై ఇల్లు ఊళ్ళు ముంచేశాయి

భూమాతకి వానభిషేకం చేస్తున్నాయి 

గొడ్డు గోదా కొట్టుకుపోయి వానకు ముద్దైపోయి 

దిక్కు లేని జనాల ఆర్తనాదాలు

దిక్కులు పిక్కటిల్లేలా మోగి పోతున్నాయి

ఇకనైనా చాలించమ్మా నీ పరవశం

కాస్తయినా కరుణించి దారి ఇయ్యవా ఓ మేఘం

ఉదయించే భానుడి తొలి కిరణం

ఆపాలి ఆ వరుణుడి గాయం 


                    ✍️ జ్యోతి మువ్వల.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action