STORYMIRROR

Jyothi Muvvala

Tragedy Action Inspirational

4  

Jyothi Muvvala

Tragedy Action Inspirational

స్వేచ్ఛ లేని స్వాతంత్ర దేశం

స్వేచ్ఛ లేని స్వాతంత్ర దేశం

1 min
5

పంజరం తెరిచి చానాలైనా

గూటిలో పక్షులు

ఎగరటం లేదు


పచ్చని పైరు పైకి కనిపిస్తున్న

నెలలో నెత్తురు తడి

ఇంకా ఆరటం లేదు


శవాల కంపుని మోస్తున్న గాలి

శుద్ధి చేసుకుని 

ఇంకా పునీతురాలు కాలేదు


పరాయి దొంగలను

తరిమికొట్టారుకానీ 

ఇంటిదొంగకు దారి చూపారు


ఎన్నో ఎర్ర మందారాలు

మొగ్గ తొడిగాయి

 రాలిపోయాయి 

 కానీ ఇంకా బతుకుల్లో చీకటిని తరిమే

 వెలుగు రేఖలు ఉదయించ లేదు


కన్నీళ్లు తుడుచుకోలేని చేతులు

ప్రణమిల్లి మొక్కటం నేర్చుకున్నాయి

ఆత్మను చంపేసి ఆట బొమ్మలుగా మారిపోయారు !!


జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu poem from Tragedy