Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyothi Muvvala

Classics Inspirational Children

4  

Jyothi Muvvala

Classics Inspirational Children

అద్వైతం

అద్వైతం

1 min
302



ఓ కవిత ఆకాశం అంతా అందంగా లేకపోవచ్చు

భూమంత సారవంతం కాకపోవచ్చు

నక్షత్రాల మెరుపు

జాబిల్లి జిలుగు ఉండకపోవచ్చు!


ఓ మనసు పాడే గుబులు గీతం

ఎండమావి లాంటి విషాదం

చైత్రం లాంటి చిరు ఆశ

ఉషస్సు కోసం ఊపిరి బిగబట్టే 

హృదయాలకు ఉపశమనం అయ్యుండాలి !


చీకటి ముసుగు వేసుకోని

సంస్కరణలు, సిద్దాంతాలు అంటూ

జీవితం ఒక నిత్యకృత్యంగా

చట్రంలో ఇరుసు లాంటి అమాయకులకు 

ఆలోచన కావాలి!


శిల్పకారుడి చేతిలో బొమ్మకి

మట్టి కుండలు చేసే కుమ్మరికి తేడా 

చూపించే విధానంలోనే గాని

ఆధారమైన ఆకృతిలో మారదు కదా !


ఏ కవిత కైన  వస్తువు ఏదో ఒక జీవితమే కదా

కనిపించే నాటకాన్నికి డైలాగ్స్ చెప్పటం కాదు

అగుపించని భూటకానికి మాటలు రాయగలగాలి 

మనకే తెలియని రహస్యాన్ని ఛేదించాలి!!


- జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu poem from Classics