STORYMIRROR

Jyothi Muvvala

Fantasy

3  

Jyothi Muvvala

Fantasy

గ్రహణ వీచిక!

గ్రహణ వీచిక!

1 min
7


చీకటి నింపుకున్న అమావాస్యల

అగమ్యగోచరంగా

 నీటి మీద బుడగల్లా

కొన్ని జీవితాలు 

తేలిపోతుంటాయి!


కష్టపడి చదివిన 

రిజర్వేషన్ 

పర్సంటేజ్ 

ఒక వరలో కత్తులై యిమడక 

ఆకాశంలో ఎగిరే సీట్లను 

అందుకోలేక!


చదివే చదువు 

కొలువులకు పనికి రాక 

బూడిదలో పన్నీరులా 

నిరుద్యోగంతో మగ్గి 

బ్రతుకు వీధిపోటై 

వెక్కిరిస్తుంది!


వయసు పెరిగి

అనుభవం తరిగి

మనసు విరిగి

తలరాతను

దారిద్య్రగీతను 

తుడిపే ప్రయత్నంలో

కాలం కరిగిపోతుంది!


కనికరం లేని కర్మకు

జవాబు దారిగ

ఈ పుస్తకాన్ని నింపుకోడానికి

సిరా చుక్కలుగా

రక్తాన్ని ధారపోసిన 

కాళీ పేజీగా పోతుంటారు!!



- జ్యోతి మువ్వల



Rate this content
Log in

Similar telugu poem from Fantasy