STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy

మనసు తనువు

మనసు తనువు

1 min
525

నా మనసు ముంగిళ్ళలో 

నా వయసు వాకిట్లో

నీ చిరునవ్వు వలపు మంత్రంతో

చిలిపి ఊహలకు ప్రాణం పోశావు

నా పదాల జడి ప్రవాహంలో

నీ ప్రేమ తరంగాల వలయంలో

ఉక్కిరిబిక్కిరి అవుతున్న....


తనువు తపనలో

అణు విస్ఫోటనం

శక్తి సృష్టి చర్యకు

శరీర ప్రకంపనలతో

పారవశ్యంలోకి లోనవుతున్న


పగలు మనసు

రాత్రి తనువు

ఎడతెరపని ఊగిసలాటలో

రోజులు ఊగిపోతున్నాయి


వెన్నెల రాత్రుల్లో, 

హేమంత ఋతువులో

ఒళ్ళంతా బరువెక్కి

కోరికలు మహావృక్షమై 

నింగి అంచు తాకుతున్నవి


నీ ఉనికి ఊహ రాగానే

ఈ దేహ తన్మయత్వం

కడలి నురగల్లే పొంగి

నీ దేహ సంద్రంలో సంగమిస్థనంటున్నది


*********


సమీరం దూరం నుండి సినీ సంగీతాన్ని లీలగా మోసుకొచ్చింది

"(వస్తాడు నా రాజు ఈ రోజు రానె వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన.

తేలి వస్తాడు నా రాజు ఈ రోజు...)"



Rate this content
Log in

Similar telugu poem from Romance