STORYMIRROR

Jyothi Muvvala

Fantasy Inspirational Others

4  

Jyothi Muvvala

Fantasy Inspirational Others

సొట్ట గిన్నే

సొట్ట గిన్నే

1 min
353


నిజం ఎప్పుడు 

చీకటిలోనే ఉంటూ

నిశ్శబ్దంగా తను కోల్పోతున్న 

అస్తిత్వాన్ని చూసి నవ్వుకుంటుంది !


జిలుగుల వెలుగులు 

తగిలించుకున్న అబద్ధం

 హడావిడి చేస్తూ

గుమ్మడికాయ దొంగ అంటే...


భుజాలు తడుముకుంటూ 

తనది కాని ఆత్మాభిమానాన్ని

భుజాల మీద మోస్తూ 

మురిసిపోతుంది!


మరచెంబు పాటి 

విలువలేని సొట్ట గిన్నెకి 

బంగారపు పూత అద్ధితే 

విలువైన షోకేష్ బొమ్మగా మారిన 


నివురగప్పిన నిజం 

లావాగా పొంగిన రోజునా 

ఆ అబద్ధం మోస్తున్న కిరీటం కరిగి

ఆ సొట్టలకి బొక్కలు పడి

చెత్తలో పడుతుంది

మనిషి జీవితంలాగా!!



జ్యోతి మువ్వల


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy