STORYMIRROR

Jyothi Muvvala

Tragedy Others

4  

Jyothi Muvvala

Tragedy Others

పుడమి ఒడిలో నిద్రపోవడమే శాశ్వత

పుడమి ఒడిలో నిద్రపోవడమే శాశ్వత

1 min
7


నిశ్శబ్దం ఆవహించి

నిస్సహాయత పులుముకున్న దేహానికి

ప్రాణం కడగట్టిన దీపమై

తనివితీరా నిద్రపోవాలని అనిపిస్తుంది!


పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా

సమస్యల సుడిగుండంలో

దిక్కుతోచని ఒంటరిగా మారి

మృత్యు కౌగిలి మాత్రమే ఓదార్పు మంత్రమని

మనసును మాయ చేస్తుంది!


బాధ్యతలు గుదిబండలా భావిస్తూ 

కష్టాల కడలి ముంచేసినట్టు 

భ్రమలో మునిగినా మనసును

చీకటి ముసుగు కమ్మేస్తుంది!

దొంగలా అజ్ఞాతంలో దాగలేక

 దొరలా బతికే ధైర్యం లేక 

నేలతల్లి మోస్తుదన్న ఆశ

తొందరపాటుతో తీసుకున్న తుదిశ్వాస!


నేటితో ఈ కథ అయితే కంచికి చేరిన

 దేహం మట్టిలో కలిసినా 

 ఆత్మ రోజు నలిగిపోతునే ఉంటుంది!

తన వారి భాదను చూస్తూ

చేసిన తప్పుని తలుచుకుంటూ

విడిచిన దేహాన్ని పొందలేక

గతాన్ని మార్చలేక...

పశ్చాత్తాపంతో చావలేక బతకలేక 

శాశ్వత శెలవు కోసం ఎదురుచూస్తూ రోధిస్తుంది!


-జ్యోతి మువ్వల 



Rate this content
Log in

Similar telugu poem from Tragedy