STORYMIRROR

Jyothi Muvvala

Classics Inspirational

4  

Jyothi Muvvala

Classics Inspirational

మహిళా శిరోమణి

మహిళా శిరోమణి

1 min
6


ఆమె రెండు తరాలకు వారధి

కుటుంబ వ్యవస్థకు సారథి

మమతానురాగాల పెన్నిధి

 ఓర్పు సహనంలో దాత్రి

అభిమానమే ఆయుధం ఆమెకి!


నేను నాదంటూ స్వార్థం లేక

 కల్పవృక్షమై నీడనిస్తూ 

ఇంటికి శోభనిచ్చే సిరి

వెలుగు పూలను కాచే కౌముది

ఆలీగా సర్వస్వం దారపోసే నిధి!


 కనురెప్పల మాటున

కష్టాలను దాచేసే కన్నులకలికి

చెరగని చిరునవ్వే తన ఆస్తి

అమ్మ అనే పిలుపుకే విలువనిచ్చి 

పిల్లల సంరక్షణకే జీవితాన్ని ఆర్పిస్తూ

కుటుంబ గౌరవాన్ని ఇనుమడింప చేసే కోమలి!


ప్రతి పాత్రలో ఒదిగిపోయి

ప్రతి గుండె సవ్వడికి లయగా...

ఆశయ పోరులో అలుపెరగని నారి 

చరిత్రను తిరగరాసే రుద్రమదేవి 

 ఆగ్రహిస్తే అంతు చూసే  ఆదిపరాశక్తి!



జ్యోతి మువ్వల



Rate this content
Log in

Similar telugu poem from Classics