STORYMIRROR

Jyothi Muvvala

Drama Action Inspirational

4  

Jyothi Muvvala

Drama Action Inspirational

బాలిక

బాలిక

1 min
257


అచ్చంగా రూపం ఒక్కటే

ఆ నవ్వుతో సహా

ఆలోచనలో

ఆచరణలో

చదువులో

గుణంలో 

అయినా ఎందుకో

అందరికి అబ్బాయిలు పుడితెనే ఇష్టం!


జాతి, కుల వివక్షలో

మునిగి తేలినవారికి

లింగ వ్యత్యాసం కనపడని నైజం 

దేహంలో దాగిన స్వేదంలా 

వదిలించుకోవాలనే గుణం

వంశపారపర్యంగా నేర్పబడిన దాష్టీకం!


కన్న పెగుకే లేని కనికరం

కలి ఆవహించిన లోకంలో వెతకటం 

సారం లేని మట్టిలో విత్తనం వేయటం లాంటిదే 

మీ అమ్మయినా ఏ అమ్మాయి అయినా

ఉగ్గుపాలతో నేర్పిన భేదమే

తరుణిగా మారిందనేది సత్యం!


అదిలోనే ఆజ్యం పోసి

సమానత్వాన్ని బూడిద చేసి

స్త్రీ స్వాతంత్రం కావాలి 

రక్షణ కల్పించాలి అంటూ

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు

అమ్మలే చేస్తున్నారు పోరాటం!


తరతరాలుగా మోస్తున్న 

అనాచారాలను 

దురాచారాలను

 కరాడివిలో మొలిచిన బుర్ర నుంచి

 తరిమి కొడితే 

మార్పు దానంతట అదే వస్తుంది 

జీవితాలను కాలరాసి

జాలి చూపుల వర్షంలో నానబెట్టకండి!


ఇంటి నుండే మార్పుకు

శ్రీకారం చుట్టండి

బాలికల దినోత్సవ అవసరం లేకుండా

ఆడపిల్లలను ఎదగనివ్వండి 

సమ సమాజాన్ని నిర్మించండి!!



-జ్యోతి మువ్వల 


Rate this content
Log in

Similar telugu poem from Drama