STORYMIRROR

Jyothi Muvvala

Tragedy Inspirational Others

4  

Jyothi Muvvala

Tragedy Inspirational Others

పడతి

పడతి

1 min
288


ఆమె ధరణి 

ఉషోదయ ఉషస్సులు చూపించే

 ఆమె కన్నులే ఇంటికి దీపాలు 

కానీ ఇప్పటికీ కన్నీటితోనే సావాసాలు !

 

ఆమె తరుణి

పదిమందిని ఒంటి చేత్తో నడిపించే

శక్తి యుక్తులే సిరిసంపదలు 

అనాదిగా అలసిన అమాయకురాలు!


ఆమె కౌముది

ప్రేమానురాగాలను కురిపించే వెన్నెల జల్లులే 

తరతరాలకు ఆధారాలు 

అయినా అగని భృణ హత్యలు!


ఆమె కోమలి

పరిమళపు కుసుమాలే తోబుట్టువులు

పుష్పించక ముందే నలిపేస్తున్నారు 

అత్యాచారాలతో చంపేస్తున్నారు!


ఆమె ఆడది 

ఆదిశక్తి అంటూ మధ్యమాలలోనే పూజిస్తూ

వ్యక్తిగతంగా దూషిస్తూ 

హారతిగా మార్చేస్తున్నారు!


ఆమె ఇంతి 

సమానత్వం ఇస్తునట్టే మభ్యపెట్టి

అడుగడుగున అణిచివేసే మేధావులు

ప్రశ్నించటం పాపం అంటూ 

నిలదీస్తే నేరంగా చిత్రిస్తున్నారు!


ఆమె కలికి

ఓర్పుని వస్త్రం చేసి చుట్టిన 

గెలుపును అందని ద్రాక్షను చేసినా

సహనంతో భరిస్తుందని 

పాతాళానికి తొక్కేస్తున్నారు!


 అన్ని పేర్లను అన్ని రూపాలలోనూ

 ఆమెను అణగదొక్కుతున్న

 అమ్మ అనే పిలుపు

 ఆమెను కీర్తి శిఖరాలపై నిలబెట్టింది 

 అమ్మగా ఆమె లోకాలను పాలిస్తుంది

 

 ఆమె పడతి

 ఆమెలో ఉంది ఓ చంద్రముఖి!!


జ్యోతి మువ్వల



Rate this content
Log in

Similar telugu poem from Tragedy