STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy

ప్రేమ జాడలు

ప్రేమ జాడలు

1 min
437

ప్రియా!

నీ మృదు సంభాషణ

నా చరవాణిలో

నీ కాళీ అందెలు నా ఇంటి ముంగిళ్ళలో

నీ జడ గంటలు నా వీధిలో

నీ మధుర భావాలు నా మనసులో

నాలో ముప్పయి నాడులను మురిపించాయి

నాలో ప్రేమను పుట్టించాయి

మన ప్రేమ జాడలు చూపించినా ప్రియా!


పఛ్చిక బయళ్లు, పరవళ్ళు తొక్కుతున్న సెలయేర్లు

నల్లటి కొండలు, తెల్లటి మబ్బులు, కాలువలు,

చెరువులు, గట్టులు, చెట్లు, తోటలు

మన ప్రేమకు చిహ్నాలు

రా ప్రియా! యాది మరిచావ,

మనం పరవశ్యం పొందిన నేలను

నీ వన్నెలను వడ్డించిన తోటలను

జలకాలాడిన కాలువలను

నీ మేని మెరుపుతో వెన్నెలగా మార్చిన బండలను

మన శ్వాసే గంధంగా ఈ ఊరు గాలిలో కలిసి 

మన మనసును రాగా బంధంగా మార్చిన మట్టిని

మరిచావ ప్రియా!


Rate this content
Log in

Similar telugu poem from Romance