Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ARJUNAIAH NARRA

Fantasy

4.8  

ARJUNAIAH NARRA

Fantasy

నవ కవి

నవ కవి

1 min
458



ఎవరు ఆ సుందర స్వప్నం

ఎవరు ఆ అనామిక

ఎవరు ఆ మరిచిక

అందమైన కవి గుండెకు 

లోతైన గాయం చేసి 

కన్నీళ్ల గేయం తీసుకొచ్చిన

కర్కశ నర్తకి ఎవరు?


అ సుందర స్వప్నాలను

అ ప్రకృతి ఆందాలను చూసిన కళ్ళు

అ పువ్వుల నవ్వులను ఆస్వాదించిన

మనసుకు ఏమైంది?

ఊహల ఉసేలేదు

ఆశలు అడుగంటి పోయాయి

దగాపడిన గుండె సవ్వడి 

మనసు అగ్నిపర్వతంలా పేలి

ఆ సౌందర్యరాధకుడిని హత్య చేసింది

ఆ శిథిలాలో మళ్ళీ నేను నవ కవిగా పుట్టాను


ఇంకిపోయిన మనసు పొరల్లోంచి 

తడి ఆరిన గుండె గాయంలోంచి

అనుభవాలు, కన్నీటి బొట్టులు

లికించటానికి మళ్ళీ కవినై పుట్టాను



Rate this content
Log in

Similar telugu poem from Fantasy