వశమై శాశ్వతమౌతా!
వశమై శాశ్వతమౌతా!
నన్ను అధీనంలోకి తెచ్చుకునేందుకు
మంత్రం వేయాల్సిన అక్కరలేదు,
ఓ ఓర చూపు విసురు చాలు
నేను నీ వాడనయిపోతా......
నన్ను బందించాలంటే బ్రహ్మాస్త్రాన్ని
విడవాల్సిన పనిలేదు,
నీ చీర అంచును నా వేలీకి కట్టు చాలు
నే జీవితఖైదునవుతా.......
నేను నూరేళ్లు బతకాలంటే ఏ దేవున్నో
కోరాల్సిన అవసరం లేదు,
నుదుటిన కుంకుమగా నన్ను పెట్టుకో చాలు
నేను చిరంజీవినవుతా.........
నిధి నిక్షేపాలు దొరకాలంటే ఏ దీవులనో
వెతకాల్సిన బాధ లేదు,
చిన్ని నవ్వు నాకు ఇచ్చుకో చాలు
నే అ
పరకుబేరుడనవుతా.....
నేను తిరిగిరావాలంటే సావిత్రిలా
యముడితో గోడవపెట్టుకోవాల్సిన కష్టం నీకు లేదు,
ప్రేమగా నా పేరు పిలువు చాలు
చితిలో నేను శవమైనా నీ వశమైపోతా....
శాశ్వతమౌతా....
నీలో .....