Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Baswaraj Mangali

Inspirational Others


4  

Baswaraj Mangali

Inspirational Others


ఆమని పిలిచే.. అతిథిగా నన్నే...

ఆమని పిలిచే.. అతిథిగా నన్నే...

1 min 33 1 min 33

మరీ...మరీ.. రమ్మనీ....

కోరెనే ఆమని.

కొమ్మా... కొమ్మా.... రెమ్మనీ....

తుమ్మెదై తాకనీ.....

ఇలా.....ఇలా... కమ్మనీ....

కలలనే అందుకొమ్మనీ ..


మరీ మరీ ఇలా ఇలా........

కోరెనే ఆమని....


చరణం 1:ఉషస్సు కై సరస్సు వేచే......

      .తమస్సు లో తపస్సుగా.....

      తుషార లో హుషారు చేరే..

      సమీరమై విహారించగా ...

      ఆహ్వాన్నించే అందాలన్నీ.......

       నన్నే అతిథిగా..........

       మమేకమై మనస్సుతో .....

        ఇలాగే ఆస్వాదిస్తూ ఉండనా........


మరీ.....మరీ.....రమ్మనీ......

కోరెనే ఆమని.

కొమ్మా....కొమ్మా.......

రెమ్మనీ తుమ్మెదై తాకనీ.........


చరణం 2:పాడెనే కూని రాగమే......

       కొండా కోన మేఘమై.......

       హరివిల్లే జల్లయి కురిసే.......

       పూరేళ్లు తుళ్లి పోయే.......

      కోయిలమ్మ కృతులను పాడే...

      కూనలమ్మ శృతులను చేర్చే... 

      నెమలమ్మ గతులను వేసే....

      హంసలేమో హోయలకు పోయే.....


ఈ సొగసులకు సాక్షమిమ్మనీ.....

పిలిచెను నన్నే....ఆ నింగి నేలే.........


మరీ.....మరీ.....రమ్మనీ......

కోరెనే ఆమని.

కొమ్మా....కొమ్మా.......

రెమ్మనీ తుమ్మెదై తాకనీ.........


చరణం 3:చెలరేగిన చీకటిననీ......

       ఓ కిరణం తో కోస్తాననీ......

      ఈ యాంత్రిక జీవనానికీ..... 

     కొత్త మంత్రం నేర్పుతాననీ.......

     అస్థిరతకు సుస్థిరతను అందిస్తాననీ..... 

    మరిచావేమో ప్రకృతిలో నీవు భాగమనీ.... 

       మరలా...మరలా గుర్తు చేస్తానంటూ..


ఈ తత్వాన్ని మనిషికి భోదించమనీ.....

మరీ.....మరీ.....రమ్మనీ......

కోరెనే ఆమని.

కొమ్మా....కొమ్మా.......

రెమ్మనీ తుమ్మెదై తాకననీ ........

ఇలా.....ఇలా... కమ్మనీ....

కలలనే అందుకొమ్మనీ......


.................ధన్యవాదాలు🙏...... 
Rate this content
Log in

More telugu poem from Baswaraj Mangali

Similar telugu poem from Inspirational