Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Baswaraj Mangali

Inspirational Others


4.5  

Baswaraj Mangali

Inspirational Others


జన గణ మని ఆ గగనం నిండా!

జన గణ మని ఆ గగనం నిండా!

1 min 239 1 min 239


ఎగరేద్దాం!  మన జాతీయ జండా

         జన గణ మని ఆ గగనం నిండా


వినీల హిమాచల శిఖరము పైనా 

విశాల భరతనేల శిరము పైనా

కోమల బాలల హృదయ మైదానం పైనా

కమల పువ్వుల నవ్వుల వదనం పైనా 


ఎగరేద్దాం!  మన జాతీయ జండా

         జన గణ మని ఆ గగనం నిండా


వేషాభాషలు వేరైనా

రీతులు జాతులు ఏవైనా

సమతా మమతా సాక్షిగా

ఐక్యమత్యమే ఆస్తిగా


ఎగరేద్దాం!  మన జాతీయ జండా

         జన గణ మని ఆ గగనం నిండా


గంగా- గోదారి -కృష్ణా!

పొంగే కావేరి

నిర్మల నదులకు నెలవని

హిందూ- అరేబియా

సిందూ బంగాళ 

స్వచ సముద్రాలకు కొలువని 


ఎగరేద్దాం!  మన జాతీయ జండా

         జన గణ మని ఆ గగనం నిండా


మనందరి గుండెలన్ని పొంగగా

త్రివర్ణపు ధ్వజాన్ని ఎత్తగా

లోకం కనులే నింగిని తాకగా

భారతీయులమని గర్విస్తూ


యదేచ్చగా..

ఎగరేద్దాం!  మన జాతీయ జండా

         జన గణ మని మన గుండెల నిండా

            జన గణ మని  ఆ గగనం నిండా

   

            
Rate this content
Log in

More telugu poem from Baswaraj Mangali

Similar telugu poem from Inspirational