తాపసి! నా ప్రేయసీ!
తాపసి! నా ప్రేయసీ!


సఖీ......
నడి యామిని జగమావరించిన తామసిలో.....
నారి సౌదామిని లా జపమాచారిస్తున్న తాపసీ.....
మల్లె పందిరి ముందు ముత్యాల ముగ్గులా......
మధుమాస మందార ముఖానికి సిగ్గులా........
సుకుమార సుమాల మాలల లతలలా............
సుగంధ గంధ వసుధ మధు సుధలా........
ఈల రాగాలలో తూలె జోల లీలలా..........
వేల వేలుపులు వెలసి వెలిగే జ్వాలలా........
పసి పంకజ పత్రం పై పడిన పసిడి వానలా........
పల్లవించిన తొలి చిగురు నుంచి రాలే నీటి సోనలా...
అరుదించే... నాకు.....
నిన్ను కాంచినప్పుడు.... ప్రియా!...సఖీ!...
ప్రేయసీ!.